హేమ అందుకే బిగ్ బాస్ ఒప్పుకున్నారట

872
Bigg Boss 3 Telugu Organisers Pay Higher Remuneration To Actress Hema
Bigg Boss 3 Telugu Organisers Pay Higher Remuneration To Actress Hema

టీవీ ప్రేక్షకులందరూ ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్యక్రమం బిగ్బాస్ సీజన్ 3. ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్బాస్ సీజన్ 3 జూలై 21 నుండి మొదలుకానుంది. బిగ్బాస్ సీజన్ 3 లో టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు అని తెలిసిందే. మరి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ లుగా ఎవరు వెళ్ళబోతున్నారు అనే విషయంపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. తాజాగా బయటకి వచ్చిన కాంటెస్టెంట్ ల లిస్ట్ ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. బిగ్బాస్ సీజన్ 3 లో రాబోతున్న సెలబ్రిటీలు వీళ్లే అని చాలా పుకార్లే వచ్చాయి కానీ అన్నిటికన్నా షాక్ హేమ.

కామెడీ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హేమ అందరికీ సుపరిచితురాలు. అయితే ఆమె ఎప్పుడూ ఇలాంటి షో లలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తపరచలేదు. ఇప్పుడు అన్నిటికన్నా షాక్ ఏంటి అంటే హేమ ఈ షో లో అడుగుపెట్టడం. టాప్ కమెడియన్లలో హేమ కూడా ఒకరు. ఆమె అద్భుతమైన కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటిదాకా వెండి తెరపై మెరిసిన ఈమె ఇప్పుడు బుల్లి తెర పై బిగ్ బాస్ ద్వారా అడుగుపెట్టనుంది.

అయితే హేమ మొదట్లో ఆసక్తి కనబరచలేదట కానీ షో నిర్వాహకులు ఎక్కువ పారితోషికం ఆశ చూపి హేమ ని ఎలాగైనా ఈ షో లో ఉంచేలా చూస్తున్నారట. ఈ షో లో అందరికన్నా ఎక్కువ పారితోషికం హేమ కి ఇవ్వనున్నారని టాక్.

Loading...