బిగ్ బాస్ ఇంట్లో కొత్త కెప్టెన్

331
Bigg Boss Telugu Season 3 new Captain is Ali
Bigg Boss Telugu Season 3 new Captain is Ali

మొదలైన రెండు మూడు రోజుల నుంచి బిగ్బాస్ సీజన్ 3 బోలెడు గొడవలతో ఆసక్తికరంగా ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గత వారం వరుణ్ సందేశ్ కెప్టెన్ గా వ్యవహరించగా ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో అలీ రేజా గెలిచి ఇంటికి కొత్త కెప్టెన్ గా మారాడు. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో రవి, రాహుల్ మరియు అలీ పాల్గొనగా చాలా సేపటి వరకు సింహాసనం పై కూర్చున్న అలీ కెప్టెన్సీ టాస్క్ గెలుచుకున్నాడు. టాస్క్ సమయంలో బిగ్బాస్ ప్రాపర్టీని డామేజ్ చేసినప్పటికీ బిగ్బాస్ ఏమీ అనకపోవడం మరియు ఎలాంటి శిక్ష విధించక పోవడం గమనార్హం.

మరోవైపు శ్రీముఖి మరియు రాహుల్ సిప్లిగంజ్ తమ తగాదాలను స్వస్తి పలకాలని అనుకున్నారు కానీ ఇద్దరూ మళ్ళీ ఎప్పటిలాగానే ఒకళ్లపై ఒకళ్ళు నెగటివ్ గా మాట్లాడారు. మరోవైపు రాహుల్ మాత్రం పునర్నవి తో ఫ్లర్టింగ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. వితిక కూడా ఇంతకు ముందు లా రియాక్ట్ అవ్వకుండా కొంచెం సైలెంట్ గా మారిందని తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ఏడుగురిలో ఎవరు బిగ్బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్తారో ఇంకా తెలియాల్సి ఉంది.

Loading...