Saturday, April 27, 2024
- Advertisement -

ఆర్ ఆర్ ఆర్ లో తారక్ ఉండేది ఇలానే : ‘ఛత్రపతి’ శేఖర్

- Advertisement -

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్నారు. ప్రసుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ‘ఛత్రపతి’ శేఖర్ కీలక పాత్రలో నటించారు.

సినిమా గురించి.. తారక్ లుక్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. “ఆర్ ఆర్ ఆర్ లో నేను ఎక్కువగా తారక్ పక్కనే ఉంటాను. అతని స్నేహితుడి పాత్ర పోషిస్తున్నాను. నేను గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తి పాత్రలో నటిస్తాను. నేను ఎన్టీఆర్‌ని సినిమాలో రెండు మూడు గెటప్స్‌లో చూశాను. ఒక్కో గెటప్‌లో చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. ఆ గెటప్స్ గురించి నేను వివరించలేను కానీ నాకైతే సూపర్‌ అనిపించారు. చరణ్ గారితో ఒక్క సన్నివేశంలోనే నటించాను” అని చెప్పాడు.

ఇక ఇటీవలే ఈ సినిమా సెట్స్ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ అడుగుపెట్టారు. తారక్, చరణ్, రాజమౌళి, అజయ్ కలిసి దిగిన ఫొటోను రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -