చిరంజీవి కొత్త లుక్ యా సినిమా కోసమేనా..?

327
chiranjeevi new look acharya
chiranjeevi new look acharya

అగ్ర కథానాయకుడు చిరంజీవి శుక్రవారం తన అభిమానుల్ని ఒక్కసారిగా సర్‌ప్రైజ్‌ చేశారు. గుండు చేయించుకొని.. గాగుల్స్‌ ధరించి సరికొత్త ైస్టెలిష్‌ లుక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. చిరు న్యూక్‌లుక్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ ఫొటోకు ‘కెన్‌ ఐ థింక్‌ లైక్‌ ఏ మాంక్‌’ (నేను ఒక బౌద్ధ సన్యాసిలా ఆలోచించవొచ్చా?) అనే క్యాప్షన్‌ను పెట్టారు చిరంజీవి.

దానికి ‘అర్బన్‌ మాంక్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. భవిష్యత్తులో చేయబోతున్న సినిమాకు సంబంధించి ట్రయల్‌ లుక్‌లో భాగంగా చిరంజీవి ఈ కొత్త అవతారంలో దర్శనమిచ్చారని సమాచారం.

ఇక చిరంజీవి ప్రస్తుతం ఆచార్య మూవీ లో నటిస్తుండగా ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.ఆ సినిమా లుక్ ఇది అంటున్నారు..

Loading...