Friday, April 26, 2024
- Advertisement -

సై రా ఎడిట్ కి చిరంజీవి సలహాలు

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారం గా తెరకెక్కించబడుతున్న చిత్రం సై రా నరసింహ రెడ్డి సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. అలాగే చిరంజీవి కూడా సినిమా కి సంబందించిన డబ్బింగ్ పనులని పూర్తి చేశారు. ఇక చిత్ర యూనిట్ ఫైనల్ కట్ ని రెడీ చేసే పనుల్లో నిమగ్నమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎడిట్ విషయం లో చిరంజీవి ఇన్వాల్వ్ అవుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆరా తీయగా చిరంజీవి ఇస్తున్న సలహాలు సినిమా యూనిట్ కి పాజిటివ్ గా పని చేస్తున్నాయట.

ఉదాహరణ కి ఇటీవలే ఒక జానపద గేయానికి సంబందించిన పాట ఎడిటింగ్ అయ్యాక చిరంజీవి అది వీక్షించి పాట లో అనుకోకుండా ఆయన వేసిన కొన్ని మాస్ స్టెప్స్ ని గమనించారట. కథ ప్రకారం, చిరంజీవి పోషిస్తున్న పాత్ర ప్రకారం, ఆ పాట వచ్చిన సందర్భం ప్రకారం ఆ స్టెప్స్ కొంచెం ఎబ్బెట్టు గా ఉన్నాయి అనిపించిందట. స్వతంత్ర సమరయోధుడు జానపద గేయం లో అలంటి స్టెప్స్ వేయడం కరెక్ట్ కాదు అని వాటిని ఎడిట్ చేయమని చిరు చెప్పారట.

ఇలాంటివి చిరు సజెస్ట్ చేయడం ఫిలిం యూనిట్ కి బాగా హెల్ప్ అవుతుంది అని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -