Friday, April 26, 2024
- Advertisement -

ఈ సరైన విక్రమ్ ని విజయం వరించేనా..

- Advertisement -

ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమ లో ఉన్న అగ్ర హీరోల అందరి లో విజయం ఎక్కువ ఎవరికి అవసరం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు చియాన్ విక్రమ్. టాలెంట్ తో పాటు కొత్త కొత్త ఛాలెంజింగ్ స్క్రిప్ట్ ఒప్పుకోవడం లో తన గట్స్ ని ఎప్పటికి అప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న విక్రమ్ ని విజయం మాత్రం అంతా ఈజీ గా వరించటం లేదు. ఇప్పటికే పలు సినిమాలు పూర్తి చేసి వాటి విడుదల కోసం ఎదురు చూస్తున్న విక్రమ్ ప్రస్తుతం ఒక యాక్షన్ థ్రిల్లర్ ని సైన్ చేశాడు.

తన 58 వ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు అజయ్ జ్ఞాన ముత్తు పని చేయనున్నాడు. సెవెన్ స్క్రీన్స్ స్టూడియోస్ మరియు వయా కామ్ 18 స్టూడియోస్ ఈ సినిమా ని సంయుక్తం గా నిర్మించనున్నారు. ఈ సినిమా కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2019 లో మొదలవబోతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఏప్రిల్ 2020 లో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వచ్చింది కానీ ఇందులో ఎవరెవరు పనిచేస్తున్నారు అనే విషయాలు మాత్రం ఇంకా చిత్ర యూనిట్ తెలియ పరచలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -