విచిత్రం గా సాగుతున్న ఆర్డీఎక్స్ ప్రమోషన్స్

378
Different Style in RDX Love Movie Promotions
Different Style in RDX Love Movie Promotions

ఆర్ఎక్స్ 100 అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగు పెట్టిన నటి పాయల్ రాజపుట్. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అంటే పాయల్ కి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఈ భామ ఏ సినిమా ఒప్పుకుంటుంది, సినిమా ఒప్పుకుంటే, ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే ఉత్కంఠ తో అందరూ ఎంతగానో ఎదురు చూసిన విషయం మనకి తెలిసిందే. ఇప్పుడు ఆమె త్వరలో ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమా తో మన ముందుకు వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం చుట్టూ ఉన్న బజ్ అస్సలు ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి. అదేంటో గానీ ఈ సినిమా టీజర్ కి ఒక రకమైన రెస్పాన్స్, మరియు ఈ సినిమా ట్రైలర్ కి ఒక రకమైన రెస్పాన్స్ రావడం తో ఎవరికీ ఏమి అర్ధం కాలేదు. అసలు ఈ సినిమా లో ఏముంది? దర్శక నిర్మాతలు ఏం చెప్పాలి అని అనుకున్నారు అనే విషయాల మీద ఎవరికీ ఏమి క్లారిటీ రాలేదు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ట్రైలర్ విడుదల నుంచి ఈ హీరో హీరోయిన్లు కాస్త ప్రమోషన్స్ తో బిజీ గా గడుపుతున్నారు. అందులో భాగంగా ఈ మధ్య హీరో మాట్లాడుతూ పాయల్ మీద కొన్ని ఫన్నీ కామెంట్స్ చేసాడు. పాయల్ రాజపుట్ ఈ సినిమా లో కో ఆపరేట్ చేసింది అని చెప్పి ఆ వెంటనే వేరే లా అనుకోవద్దు అని అన్నాడు. ఇలా సరదాగా చెప్తూ మెల్లగా సినిమా మీద ఆసక్తి ని రేకెత్తిస్తున్నారు చిత్ర యూనిట్.

Loading...