Saturday, April 27, 2024
- Advertisement -

భార్య తేజస్వినితో దిల్ రాజు ఫోటో షూట్.. అదిరింది..!

- Advertisement -

దిల్ రాజు గారు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా మనందరికీ సుపరిచితమే. చిన్న పెద్ద హీరోలు అనే తేడా లేకుండా అందరితో మంచి మంచి సినిమాలు తెరకెక్కించి హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నారు. దిల్ రాజు ప్రొఫెషనల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ గా దూసుకుపోతున్నారు. అలాగే పర్సనల్ లైఫ్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ లాక్ డౌన్ లో మే 10న తేజస్వినితో వివాహం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత నుండి దిల్ రాజు గారు ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. భార్య తేజస్వీని దిల్ రాజు గారి లైఫ్ స్టైల్ ని మార్చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇప్పుడు ఇప్పుడు ఫీట్ నెస్ మీద కూడా బాగా ఫోకస్ చేశారట. అయితే రీసెంట్ గా భార్యతో కలిసి ఒక ఫోటో షూట్ చేయించుకున్నారు దిల్ రాజు. ఆ ఫోటో షూట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ ఫోటోస్ చూసిన వారంతా మీ జంట సూపర్ రాజు గారు.. ఇలాగే ఎప్పుడూ హ్యాపీగా ఉండండి అంటూ కామెంట్స్ పడుతున్నారు.

ఇక దిల్ రాజు చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో నాని, సుధీర్ బాబు నటించి వీ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. మళ్లీ థియేటర్స్ ఓపెన్ కాగానే ఈ సినిమా ముందు రిలీజ్ కానుంది. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఈ సినిమా దాదాపు యాబై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కరోనా పరిస్థితులు సర్దుకోగానే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది.

పొట్ట తగ్గట్లేదు అంటూ అద్దంని తిడుతున్న విష్ణు ప్రియా..!

హీరోయిన్ ని ముద్దులతో ముంచెత్తిన వర్మ..!

పవర్ స్టార్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ..!

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ అదిరింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -