Saturday, April 27, 2024
- Advertisement -

దిల్ రాజు కూడా ఆ సినిమా కి నిర్మాత నా?

- Advertisement -

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం మహర్షి సినిమా తో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా విజయం దిల్ రాజు కి డబ్బు తో పాటు పేరు కూడా సంపాదించి పెట్టింది. అయితే నిరుత్సాహం పరిచే అంశం ఏంటి అంటే ఈ సినిమా కి దిల్ రాజు తో పాటు మరో ఇద్దరు నిర్మాతలు కూడా ఉండడం తో రాజు కి లాభాల్లో పెద్దగా మిగల్లేదట. అయితే అనిల్ రావిపూడి మహేష్ బాబు తదుపరి చిత్రం లో అయినా లాభాలు పొందుదాం అనుకున్న రాజు కి ఇప్పుడు ఒక అనుకోని అడ్డంకి ఎదురైంది అని ఫిలిం నగర్ టాక్.

దిల్ రాజు కి సంబంధం లేకుండా నే అనిల్ రావిపూడి మహేష్ బాబు కోసం కథ ని సిద్ధం చేసాడట. అయితే మహేష్ బాబు కోరిక మేరకు ఈ సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ని అనిల్ సుంకర దగ్గర ఉండి చూసుకోవడమే కాక కొంత అడ్వాంస్ కూడా ఇచ్చారట. చివరి నిమిషం లో ఈ విషయం తెలుసుకున్న దిల్ రాజు ఈ సినిమా ని నిర్మిస్తానని ముందుకు రాగా అనిల్ సుంకర పెద్దగా అబ్జెక్షన్ తెలపలేదు.

ఇప్పుడు మహర్షి విజయం తో మహేష్ మార్కెట్ పై మారిన అంచనాల దృష్ఠ్య అనిల్ సుంకర ఈ సినిమా నిర్మాణం లో మేజర్ షేర్ పొందేలా ఉన్నారు. సినిమా నిర్మాణ దశకి వచ్చే సరికి నిర్మాత గా ఉండాలన్న దిల్ రాజు ప్రేసెంటర్ గా కానీ కో ప్రొడ్యూసర్ గా కానీ ఉండాల్సిన పరిస్థితి రావచ్చు అంటున్నారు దర్శక నిర్మాతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -