Friday, April 26, 2024
- Advertisement -

డియర్ కామ్రేడ్ నుంచి దర్శకుడు బయటకు వచ్చాడా?

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం అందరూ ఇష్టపడే హీరోల లో విజయ్ దేవరకొండ ఒకడు. అన్ని రకాల సినిమాలని ట్రై చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులని దగ్గర చేసుకుంటూ ముందుకు వెళ్తున్న విజయ్ మార్కెటింగ్ చేసుకోడం లో ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలని అమలు చేస్తూ ఉంటాడు. అందుకే నిన్న గాక మొన్న వచ్చినా ఎప్పటి నుంచో ఇండస్ట్రీ లో ఉన్న వాళ్ళ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు విజయ్. తాజాగా డియర్ కామ్రేడ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల తో బిజీ గా ఉన్నాడు. యష్ రంగినేని, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్త నిర్వహణ లో ఈ సినిమా త్వరలో రానుంది.

ఇంతకు ముందు చంద్రశేఖర్ యేలేటి దగ్గర పని చేసిన భరత్ కమ్మ ఈ సినిమా తో దర్శకుడి గా పరిచయం కానున్నాడు. అయితే తాజాగా ఈ దర్శకుడు ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాడు అనే పుకార్లు ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. ఔట్పుట్ విషయం లో విజయ్ కి దర్శకుడికి చెడిందని, అందుకే క్రియేటివ్ నిర్ణయాలు విజయ్ తీసుకోవడం మొదలు పెట్టాడని ప్రచారం సాగుతుంది.

కాగా స్వతహాగా సౌమ్యుడయిన భరత్ ఎప్పటి నుంచో విజయ్ తో ట్రావెల్ చేస్తున్నాడని, అంత ఈజీ గా విజయ్ తో విభేదించడని, పైగా తన తొలి చిత్రాన్ని ఇలా అర్థాంతరంగా వదిలి వెళ్ళే సమస్య లేదని సినిమా కి పని చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే అప్పుడే విజయ్ సినిమా కి నెగటివ్ పబ్లిసిటీ ని మొదలు పెట్టారు అనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -