ఛాన్స్ ఇస్తానని పిలిచి.. రూంలోకి తీసుకెళ్లాడు : ఫన్ బకెట్ భార్గవి

1083
fun bucket actress bhargavi about casting couch
fun bucket actress bhargavi about casting couch

చిన్న ఛాన్స్ కోసం ఇండస్ట్రీ చూట్టు తిరిగేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ కొందరి కామ ఆలోచనల కారణంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న యాక్టర్స్ భయపడి వెనక్కి వెళ్లిపోతున్నారు. సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది నటీమణులు చెప్పారు. ఇక ఇటీవల ఫన్ బకెట్ భార్గవి కూడా క్యాస్టింగ్ కౌచ్ చేదు అనుభవాలను బయట పెట్టింది. ఆమె ఇటివలే ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పింది.

ఆమె మాట్లాడుతూ.. ” హీరోయిన్ గా ఆఫర్ కోసం ట్రై చేస్తున్న టైంలో ఒక నిర్మాత ఆఫీస్ కి పిలిచాడు. వెళ్లిన తర్వాత రూంకి పిలిచాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి డోర్ లాక్ చేసి వెళ్లాడు. నిర్మాతతో నేను ఒక్క దాన్నే ఉన్నాను. నేను ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా సైలెంట్ గా అలానే కూర్చున్నాను. కొంత సేపటికి నిర్మాత మెల్లగా మాటలతో నన్ను ఫ్లట్ చేసే ప్రయత్నం చేశాడు. అవుట్ డోర్ లోనే షూటింగ్ ఎక్కువగా ఉంటుంది. మరి నా పరిస్థితి ఏంటి? ఏమైనా ఉందా లేదా? ఇస్తావా? అని అన్నాడు. నేను ఏ మాత్రం కౌంటర్ ఇవ్వకుండా అక్కడ నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని అనుకున్నాను.

వెంటనే కూల్ డ్రింక్ తాగమని అన్నారు. నాకు డౌట్ వచ్చి తాగలేదు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక వెంటనే మా అమ్మ ఫోన్ చేస్తోంది అంటూ ఫోన్ రాకపోయినా మాట్లాడుకుంటూ అలా బయటకు వెళ్లిపోయా. అంతకుముందు కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్య మూడు సార్లు ఎదురయ్యింది. కానీ వారు అడిగిన కమిట్మెంట్ కి నేను ఏ మాత్రం ఒప్పుకోలేదు. కానీ ఆ నిర్మాత చేసిన పనికి మాత్రం ఎంతగానో భయపడ్డాను. సినీ ఇండస్ట్రీలో అందరు అలా ఉండరు కానీ దాదాపు సగం మంది అలాంటి వారే అని భార్గవి చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరోల మొదటి మూవీ ఏదో చూడండి ?

అతనితో విడిపోయాక చాలా రూమర్స్ వచ్చాయి : యాంకర్ ఝాన్సీ

‘ఛీ దరిద్రుడా.. తూ’ అని సుధీర్ పరువు తీసిన రష్మీ..!

ఆ పొట్ట ఏంట్రా అని స్టేజ్ మీదా ఆది పరువు తీసిన వర్షిణి..!

Loading...