బిగ్ బాస్ హౌస్ లోకి రానున్న ఫ్లాప్ హీరోయిన్

313
Hebah Patel to Contest in Bigg Boss Telugu Season 3
Hebah Patel to Contest in Bigg Boss Telugu Season 3

ఇప్పటికే బిగ్ బాస్ రెండు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ బిగ్ బాస్ మూడవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ సీజన్ 3 ఏ నెల 21 నుండి మొదలవనుంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి ఎంటర్ అయ్యేవారి గురించి ఇప్పటికే బోలెడు పుకార్లు బయటికి వచ్చాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇప్పటికే శ్రీముఖి, గాయత్రి గుప్తా, ఉప్పల్ బాలు వంటి పేర్లు వినిపించాయి కానీ అందులో నిజానిజాలు ఇంకా తెలియలేదు. అయితే తాజాగా ఒక ఫ్లాప్ హీరోయిన్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ హీరోయిన్ ఎవరో కాదు హెబ్బ పటేల్. కెరీర్ మొదట్లో ‘కుమారి 21ఎఫ్’ వంటి హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ హెబ్బ కి హీరోయిన్ గా మంచి పేరు దక్కలేదు. ఆఖరికి 24 కిస్సెస్ వంటి చిత్రాల్లో గ్లామరస్, బోల్డ్ పాత్రలు కూడా పోషించింది కానీ అనుకున్నంత ఫేమ్ ఆమెకు అందలేదు. మరోవైపు బిగ్ బాస్ మేకర్స్ ఈమెను స్వయంగా పిలిచారని తెలుస్తోంది. ఎలాగో సినిమాలు లేవు కాబట్టి హెబ్బ బిగ్ బాస్ లో కనిపించే అవకాశాలు లేకపోలేదు. బిగ్ బాస్ హౌస్ లో కూడా హెబ్బ తన అందాలను ఆరబోస్తూ ఉంటే అభిమానుల్లో మరింత క్రేజ్ సంపాదించచ్చు. మరి వెండి తెర భామ హెబ్బ బుల్లి తెరపై ఎంత హడావిడి చేస్తుందో చూడాలి.

Loading...