Friday, April 26, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి 50 లక్షలు తీసుకున్న వ్యక్తి

- Advertisement -

రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ ఒక్క మహిళ వద్ద 50 లక్షలు తీసుకుని పరారైన సంఘటన తాజాగా హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఒక మహిళా లాయర్ ని మోసం చేసి 50 లక్షలు తీసుకున్నందుకు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు నరేష్ కుమార్ అలియాస్ ఆదిత్య అని ఇవాళ అరెస్ట్ చేశారు. టెలిఫోన్ డైరెక్టరీ లో నరేష్ కుమార్ ఒక మహిళ లాయర్ మొబైల్ నంబర్ను తీసుకొని తాను ఒక సినిమా నిర్మాతనని లీగల్ అడ్వైజ్ కోసం ఫోన్ చేస్తున్నాను అని ఆమెను నమ్మించాడు. అప్పుడప్పుడు ఇదే విషయమై కలుస్తూ ఒకరోజు ఆమెకు సినిమాల్లో నటించడం మీద ఆసక్తి ఉందా అని అడిగాడు.

ఆమె కూడా ఆసక్తి చూపించటంతో నరేష్ కుమార్ రాజమౌళి గొంతు ని ఇమిటేట్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కచ్చితంగా ఒక పాత్ర ఇస్తానని నమ్మబలికాడు. అతనిని నమ్మిన ఆ మహిళ 50 లక్షలు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. సినిమాలో పాత్ర మాత్రమే కాక ఫిలిం ఛాంబర్ మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ లో కూడా ఆమెకు మెంబర్షిప్ ఇస్తానని అతను ఆమెను మోసం చేశాడు. అంతే కాక నరేష్ లాయర్ వద్ద ఉన్న మారుతి కార్ కూడా తీసుకుని మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. తాజాగా అతని స్నేహితులు సోమన్న మరియు రామకృష్ణ ఆమెను కలిసి మళ్లీ డబ్బులు అడిగారు. ఆమె కుదరదని చెప్పటంతో ఆమెను బెదిరించారట. దీంతో ఆమె పోలీసులను సంపాదించింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నరేష్ ను అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -