Friday, April 26, 2024
- Advertisement -

ప్ర‌ముఖ న్యూస్‌ ఛానల్‌, సంధ్య‌పై కేసు పెడ‌తా…

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమను ‘కాస్టింగ్ కౌచ్’ వ్యవహారం కుదిపేస్తోంది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఇలా ఎవర్నీ వదలడంలేదు. ఓ ఛాన‌ల్ డిబేట్‌లో సామాజికి ఉద్య‌మ‌కారి ని సంధ్య జీవిత‌రాజ‌శేఖ‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు. హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఉండే అమ్మాయిలను జీవిత తన భర్త రాజశేఖర్ కోసం వాడుకున్నారని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై జీవిత స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సంధ్య నా గురించి ఎలా మాట్లాడుతుందని ఆమె ప్రశ్నించారు. సెలబ్రెటి కుటుంబాల గురించి సంధ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందన్నారు. నాపై, నాకుటుంబంపై అసత్య ప్రచారం చేసిన చానల్‌పై, సంధ్యలపై కేసు పెడతానన్నారు. అంతేకాకుండా పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. నాపై చేసిన ఆరోపణలకు సమాధానం వచ్చే నేను నిద్రపోనన్నారు.

ఛానల్ చేతిలో ఉంది కదా అని ఏమైనా మాట్లాగలం అనుకోవద్దు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీ మీద నేను తీసుకోబోయే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండండి. ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరుకుంటున్నాను.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -