Friday, April 26, 2024
- Advertisement -

ఎన్టీఆర్ చాలెంజ్ ను బాలయ్య అంగీకరిస్తారా?

- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరో బాలక్రిష్ణ అంటేనే పౌరుషానికి, ఆవేశానికి ప్రతీక. ఆయన ఎమ్మెల్యేగా ప్రజా సేవ కూడా చేస్తుంటారు. ఇక సినిమాల్లో షూటింగ్ లో.. బయట ఎంతో మందిని కోపంతో లాగి ఒక్కటి పీకాడు. కాస్తా ఈ తరం మనిషిగా కనిపించడాయన.. అలాంటి ఆవేశ బాలయ్యకు ఇప్పుడు ఒక చాలెంజ్ ఎదురైంది. అది విసిరింది ఆయన అన్న కొడుకు జూనియర్ ఎన్టీఆర్. కొద్దిరోజులుగా ఉప్పునిప్పుగా ఉంటూ వీరిద్దరూ మధ్యలో కలిసిపోయారు. మరి ఎన్టీఆర్ విసిరిన ‘బి ద రియల్ మ్యాన్’ చాలెంజ్ ను బాలక్రిష్ణ యాక్సెప్ట్ చేస్తాడా? బోల్లు బాసన్లు తోముతాడా? అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంట్లో పనులు చేస్తూ ఆడవారికి సాయంగా మగాళ్లు ఉంటామని నిరూపించేందుకు ‘బీ ద రియల్ మ్యాన్’ చాలెంజ్ ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో రాజమౌళికి విసరాడు. రాజమౌళి ఇంట్లో పనిచేసి ఎన్టీఆర్ కు విసిరాడు. ఎన్టీఆర్ కూడా ఆ పనిచేసి తాజాగా బాబాయ్ బాలయ్యకు విసిరాడు.

అయితే ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ కు దూరంగా ఉండే బాలక్రిష్ణ ఈ సవాల్ ను తీసుకుంటారా? ఇంటి పనులు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. పైగా ఈ చాలెంజ్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి రావడంతో వీరి ప్రచన్న యుద్ధం మధ్య బాలయ్య ఈ చాలెంజ్ ను స్వీకరిస్తారా లేదా అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

ఇక మరో ఆసక్తికరమై విషయం ఏంటంటే ఈ హీరోలు, దర్శకులు ఎవరూ మహేష్ బాబుకు ఈ చాలెంజ్ విసరడం లేదు. చాలా మంది దర్శకులతో విభేదాలు తెచ్చుకున్న మహేష్ బాబును ఇప్పుడు అందరూ దూరం పెడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -