Friday, April 26, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ ‘అరవింద సమేత’ మూవీ ఫస్ట్‌లుక్ వ‌చ్చేసింది…

- Advertisement -

ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. తమన్‌ బాణీలు అందిస్తున్నారు.

రేపు (మే 20) జూనియర్ పుట్టినరోజుని పురస్కరించుకుని అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ని ఇచ్చారు ఎన్టీఆర్. ‘అరవింద సమేత.. వీరరాఘవ’ అంటూ ఎన్టీఆర్ తన 28వ మూవీ ఫస్ట్‌లుక్‌తో థ్రిల్ చేశారు. ఒంటి నిండా గాయాలతో చేతిలో కత్తి పట్టుకుని సిక్స్ ప్యాక్‌తో ఉగ్రరూపంలో దర్శనం ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో హారిక హాసిని క్రియేషన్స్‌లో రాధాక్రిష్ణ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ కొద్ది సేపటి క్రితం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

చేతిలో కత్తి.. ప్యాంటుకు రక్తం మరకలు చూస్తుంటే సినిమాలో యాక్షన్స్‌ సన్నివేశాలకు బాగా చోటున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో తారక్‌ చిత్తూరు యువకుడిగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యానికి తగ్గట్టు తారక్‌ లుక్‌ ఉంది. ఈ ఫస్ట్‌లుక్‌ సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది..

ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి మొదటిసారి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఎన్టీఆర్ ‘జై లవకుశ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత త్రివిక్రమ్‌తో చేస్తుండటం ఒక విశేషమైతే.. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాడు. ఈ నేపథ్యంలో విడుదలైన టైటిల్ ఫస్ట్‌లుక్ ఈ అంచనాలను మరింత రెట్టింపు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -