Friday, April 26, 2024
- Advertisement -

మళ్లీ అదే దర్శకుడితో సినిమా చేయబోతున్న ఎన్టీఆర్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది కాబట్టి దాదాపు సంవత్సర కాలం పాటు ఈ ఇద్దరు స్టార్ హీరోలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనులలో నిమగ్నమై ఉంటారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ షూటింగ్ ఈ సంవత్సరం ఆఖరుకల్లా పూర్తవుతుందట. అందుకే తన తదుపరి సినిమా గురించి పలువురు దర్శకులతో చర్చలు జరపడం మొదలుపెట్టాడు ఎన్టీఆర్. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేద్దామంటే కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయబోతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ‘అరవింద సమేత’ సినిమాతో ఎన్టీఆర్ కి హిట్ అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ వినిపించిన స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి బాగా నచ్చేసిందని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమా ని నిర్మించనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -