Friday, April 26, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ వైపు ఆశ గా చూస్తున్న కాజల్

- Advertisement -

స్టార్ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే చిత్రం తో బిజీ గా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు విషయం ఏంటి అంటే రాజమౌళి ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ని ఎంపిక చేయలేదు. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ ఈ సినిమా లో నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన నటించాల్సిన డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుండి వైదొలిగింది. ఇకపోతే ఈ సినిమా లో ఇప్పుడు ఇంకో హీరోయిన్ ని తీసుకోవాల్సిన అవసరం కచ్చితం గా ఉంది. షూటింగ్ సమయం దగ్గరకు వస్తున్నా కొద్దీ హీరోయిన్ ని ఎంపిక చేసుకోవాల్సిన ఒత్తిడి ఎక్కువ అయింది. అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమా లో భాగం అవ్వాలని ప్లాం చేస్తుందట.

ఎలాగో పీరియడ్ సినిమా నే కాబట్టి కాజల్ అగర్వాల్ తనకి పీరియడ్ సినిమా లో పని చేయాల్సిన అనుభవం ఉంది అని, పైగా పీరియడ్ సినిమా లో రాజమౌళి తో పని చేయాల్సిన అనుభవం కూడా ఉంది అని, అందుకే తన పని ఈజీ గా అవుతుంది అని కాజల్ అగర్వాల్ భావిస్తుంది. అయితే ఇప్పటికే చిత్ర యూనిట్ కి సంబందించిన కొంత మంది తో కాజల్ టచ్ లో కి వెళ్ళి తన సుముఖత ని వ్యక్తపరిచిందట. కాకపోతే చివరికి ఏం అవుతుంది అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -