Saturday, April 27, 2024
- Advertisement -

ఆ దర్శకుడి కోసం నిర్మాత గా మారుతున్న కాజల్!

- Advertisement -

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఒక మంచి సినిమా తో పూర్వ వైభవం సాధించాలని చూస్తుంది. మొన్న చేసిన సీత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్క్ అవుట్ అవ్వలేదు. నటి గా కాజల్ కి పేరు వచ్చింది కానీ ఎంత పేరు వచ్చినా ఏం లాభం, నిర్మాతకి డబ్బులు రానప్పుడు అనే ధోరణి లో ఆలోచిస్తుంది కాజల్. అందుకే తేజ దర్శకత్వం లో నే ఇంకో సినిమా చేసి విమర్శకుల నోళ్లు మూయించాలి అనే ధోరణి లో ఆలోచిస్తుంది కాజల్. అంతే కాకుండా సీత ప్రమోషన్స్ అప్పుడు త్వరలో నిర్మాత గా మారాలి అనే ఆలోచన ని కూడా వ్యక్తపరిచిన కాజల్ ఇప్పుడు ఆ మాట ని ఆచరణ లో కూడా పెట్టాలి అని చూస్తుంది.

అయితే తనని సినిమా పరిశ్రమ కి పరిచయం చేసి నటన లో ఓనమాలు నేర్పించిన తేజ ని దర్శకుడి గా పెట్టి నిర్మాత గా మొదటి సినిమా చేయాలి అని భావిస్తోంది ఈ హీరోయిన్. అయితే ఇద్దరూ కలిసి ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంతే కాకుండా లిమిటెడ్ బడ్జెట్ లో పక్కా ప్రణాళికల తో నే ముందుకు వెళ్ళాలి అని కూడా ముందే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -