నందమూరి కల్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం 118. చాలాకాలాం నుంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్న కల్యాణ్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నాడు. ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గోన్న కల్యాణ్ రామ్ , సినిమా విశేషాలతో పాటు, రాజకీయాలకు సంబంధించిన విషయాలను కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు. కల్యాణ్ రామ్ వచ్చే ఎన్నికలలో తాను ప్రచారం చేసే దానిపై క్లారిటీ ఇచ్చాడు కల్యాణ్ రామ్.
బాలయ్య, ఎన్టీఆర్, నారా రోహిత్, తారక రత్న వంటి వారు టీడీపీ తరుపున ప్రచారం చేసినప్పటికి ,కల్యాణ్ రామ్ మాత్రం ఇప్పటి వరకు పార్టీ ప్రచారంలో ఇంత వరకు ఎక్కడ కనిపించలేదు. ఈసారి ఎన్నికలలో కల్యాణ్ రామ్ ప్రచారం చేస్తారని ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించాడు కల్యాణ్ రామ్. తనకు తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. కాని నాకు రాజకీయాలపై అంతగా అవగాహన లేదని , అందుచేతనే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపాడు.