Saturday, April 27, 2024
- Advertisement -

కృష్ణంరాజుకు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ కు తరలింపు..!

- Advertisement -

సీనియర్ నటుడు.. కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు తీవ్ర ఆస్వస్థకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణం రాజు వయస్సు 79 సంవత్సరాలు. బుధవారం అర్ధరాత్రి టైంలో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడ గమనించిన కుటుంబసభ్యులు కేర్ హాస్పిటల్ కి తరలించారు.

ఆయన్ను పరిశీలించిన డాక్టర్లు ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆయన కొద్దికాలంగా ఆయన న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్నారు. ప్రసుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.

అయితే ఆయన అరోగ్యపరిస్థితిపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ప్రభాస్,కృష్ణంరాజు అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇక కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940న జనవరి 20జన్మించారు. 183 తెలుగు సినిమాలలో నటించారు. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -