Friday, April 26, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ మరియు ఛార్మి ని ఫాలో అవుతున్న మహేష్ బాబు

- Advertisement -

ఈమధ్య చిన్న హీరోల నుంచి స్టార్ హీరో పెద్ద హీరోల వరకు సినిమాల మీద మాత్రమే కాకుండా సైడ్ ఇన్కమ్ కూడా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో ముందున్నాడు యువ హీరో విజయ్ దేవరకొండ. అతని రౌడీ వేర్ బ్రాండ్ ఇప్పటికే చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు చార్మి కూడా ఇస్మార్ట్ కలెక్షన్స్ అనే పేరుతో ఇలానే ఒక బ్రాండ్ ని మొదలు పెట్టింది. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే పని చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్యనే మహేష్ బాబు “న్యూ బిగినింగ్స్” అంటూ ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ చెబుతున్నది తన బిజినెస్ గురించేనని కొందరు కామెంట్ చేస్తున్నారు.

మహేష్ బాబు త్వరలో నే ఒక సొంత క్లోతింగ్ బ్రాండ్ ని లాంచ్ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ ఒక ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీతో టైఅప్ కూడా అవుతున్నాడని సమాచారం. బాలీవుడ్లో కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్. బీయింగ్ హ్యూమన్ అనే ఒక బ్రాండ్ నేమ్ తో చాలా కాలంగా బట్టలు అమ్ముతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తన బ్రాండ్ లాంచ్ కోసం సల్మాన్ ఖాన్ ని ఇన్వైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల పరంగా మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -