Saturday, April 27, 2024
- Advertisement -

ఫస్ట్ టైం చొక్క విప్పిన మహేష్.. ఫోటో వైరల్..!

- Advertisement -

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏ రెంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి డైరెక్టర్ ఆశపడుతుంటారు. మహేష్ బాబు ఫ్రీ టైం దొరికితే తన పిల్లలతో గడిపేస్తుంటారు. వాళ్లతో ఆటలు ఆడుతూ సరదాగా ఉంటారు. సినిమా ఫంక్షలు తప్పిస్తే బయట ఎక్కువ మహేష్ కనిపించరు.

ప్రస్తుతం మహేష్ వరుస హిట్స్ లో ఉన్నాడు. రీసెంట్ గానే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో చొక్కా విప్పి కనిపిస్తే చూడాలని అంటూ ఉంటారు. కానీ ఇంతవరకు మహేష్ ఏ సినిమాలో కూడా చొక్కా విప్పలేదు. అలాంటిది ఇప్పుడు చొక్కా లేకుండా కనిపిస్తున్నాడు. నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ లో తొలిసారిగా తన భర్త షర్ట్ లెస్ ఫోటోను పోస్ట్ చేశారు.

ఇందులో తన కుమార్తె సితారతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో మహేశ్ కనిపిస్తున్నారు. ఈ పిక్ ను నమ్రత ఇలా పోస్ట్ చేయగానే అలా వైరల్ అయిపోయింది. లాక్ డౌన్ కారణంగా ఫ్యామిలీతో గడుపుతున్న మహేశ్, ఈ సమయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యారు. ఇక ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్.. సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించాలని మహేష్ ను కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -