Saturday, April 27, 2024
- Advertisement -

రాజశేఖర్ కూడా ‘మనం’ చేస్తారట..

- Advertisement -

నటుడు రాజశేఖర్ కి తెలుగు లో తమిళం లో మంచి పాపులారిటీ ఉంది కానీ ఆయన మాత్రం తెలుగు లో నే ఎక్కువ సినిమాలు చేసి విజయం సాధించారు. ఆయన భార్య జీవిత కూడా మంచి నటి. తను కూడా కొన్ని హిట్ సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాలకి దూరం గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అదే విధం గా ఈ దంపతులు తమ ఇద్దరు కూతుళ్ళని స్టార్ హీరోయిన్ల గా చేయాలనే ఆలోచన తో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు శివాని, శివాత్మిక అరంగేట్రం చేశారు. శివాత్మిక సినిమా ఈ నెల లో విడుదల అవుతుంది కానీ శివాని సినిమా మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

అది పక్కన పెడితే ప్రస్తుతం రాజశేఖర్ మనం లాంటి ఒక సినిమా చేయాలి అనుకుంటున్నారట. ఆయన జీవిత, ఇంకా ఇద్దరు కూతుళ్లు కలిసి ఒక సినిమా లో నటించాలి అని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా కి కథ సిద్ధం అవుతుంది అని తెలుస్తుంది. అంతే కాకుండా సి కళ్యాణ్ ఈ సినిమా ని నిర్మించేందుకు ఆలోచన కూడా చేస్తున్నారట. ఇక ఈ సినిమా కి సంబందించిన మిగిలిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -