ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటాను : కాజల్

745
Manchu Lakshmi Talks With Kajal
Manchu Lakshmi Talks With Kajal

మంచు లక్ష్మీ సినిమాల్లో కనిపించడం తగ్గించిన తర్వాత లక్ష్మీ టాక్ షో వంటివి చేస్తోంది. ఈ షోస్ ద్వారా సెలబ్రిటీల మనసులో ఏం దాగి ఉన్నాయో వాటిని బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే పలువురి సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించిన మంచు లక్ష్మీ తాజాగా కాజల్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా కాజల్ నుంచి ఎవరికి తెలియని షాకింగ్ సీక్రెట్ లను ఆమె నుంచి రాబట్టింది మంచు లక్ష్మీ.

నా కెరీర్ లో నాకు చాలా చాలా ఇష్టమైన హీరో అంటే రానా దగ్గుబాటి. ఆయనతో వర్క్ చేయడం అంటే బాగా ఇష్టపడుతాను. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అంతేకాకుండా రానాతో పని చేయడం చాలా ఫన్నీగా ఉంటుంది. అలానే కష్టంగా కూడా ఉంటుంది. అందుకే రానాతో పని చేయడం నాకు ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చింది. అలానే తనవెంట ఎప్పుడు ఓ దేవుడి విగ్రహం ఉంటుందని.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన ఆ దేవుడి విగ్రహాన్ని తీసుకెళ్తానని.. ఆ దేవుడి విగ్రహం నా దగ్గర ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఫీల్ అవుతానని చెప్పింది.

మీకు అవకాశం వస్తే ఎవరితో లేచిపోతారు. ఎవర్ని చంపేస్తారు.. ఎవర్ని పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్నలను కాజల్ ను ప్రశ్నించింది మంచు లక్ష్మీ. అందుకు సమధానంగా ఆమె.. చరణ్ ను చంపేసి.. ఎన్టీఆర్ తో లేచిపోయి.. ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మరి ప్రభాస్ నే ఎందుకు పెళ్లి చేసుకుంటావు అని మంచు లక్ష్మీ ప్రశ్నించగా.. ఇప్పుడు ఉన్న హీరోల్లో ప్రభాస్ కే కదా పెళ్లి కానిది. అందుకే అతన్ని పెళ్లి చేసుకుంటాను అని తెలివిగా చెప్పుకొచ్చింది.

Loading...