Saturday, April 27, 2024
- Advertisement -

నిహారిక‌కు కులంతో సంబంధం లేకుండా పెళ్లి చేస్తా..!

- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈ పేరుగ‌త కొద్దికాలంగా సోష‌ల్ మీడియాలో బాగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో బాల‌య్యపై రెచ్చిపోయిన నాగబాబు, సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టి రాజ‌కీయ నాయకుల మీద ప‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నాడు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కుటుంబం, రాజకీయాలకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. కూతురు నిహారిక చేసే సినిమా క‌థల విష‌యంలో నేను అసలు జోక్యం చేసుకోన‌ని, అదే స‌మ‌యంలో వ‌రుణ్ తేజ్ సినిమాల విజ‌యంలో కూడా త‌న జోక్యం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశాడు నాగ‌బాబు.

నిహారిక ఇష్ట ప్ర‌క‌ర‌మే సినిమాల‌లో పంపించామ‌ని , ఇందులో త‌మ ప్రమేయం ఏమి లేద‌ని చెప్పుకొచ్చారు నాగ‌బాబు. ఇక కూతురు పెళ్లి గురించి కూడా మాట్లాడుతు.. రెండు ,మూడు సంవ‌త్స‌రాలలో నీకు పెళ్లి చేసేస్తాన‌ని చెప్పాను. ఈ స‌మ‌యంలో వెబ్ సిరీస్‌లో న‌టిస్తాన‌ని చెప్పి , ఇప్పుడు సినిమాలలో న‌టిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు. నిహారికకు పెళ్లి చేయ‌డానికి రెడీగా ఉన్నాం.బయట నుండి నీహారికకు సంబంధాలు వెతుకుతున్నట్లు.. త్వరలోనే ఆమెకి పెళ్లి చేసేస్తామని నాగబాబు స్పష్టం చేశారు.

మా కులం(కాపు)లో మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేస్తాన‌ని , ఇదే స‌మ‌యంలో బ‌య‌ట కులంలో నాకు మంచి అబ్బాయి క‌నిపించిన నిహారిక‌ను ఇచ్చి పెళ్లి చేయ‌డానికి నాకు ఎటువంటి అభ్య‌తంరం లేదు.అన్ని కులాల వారిని గౌరవించాలని, తనకు కులంతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. దీనిని బ‌ట్టి నిహారిక పెళ్లిని మ‌నం అతి త్వ‌ర‌లోనే చూడ‌బోతున్నాం అనేది స్పష్టం అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -