Friday, April 26, 2024
- Advertisement -

ఏడు గెటప్పుల్లో యువ హీరో

- Advertisement -

టాలీవుడ్ లో యువ హీరో నాగ శౌర్య కి లవర్ బాయ్ గా మంచి పేరుంది. ఈ మధ్యనే ‘ఓ బేబీ’ సినిమాలో నటించిన నాగశౌర్య ఇప్పుడు ‘అశ్వద్ధామ’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమా తరువాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాలో నాగ శౌర్య నటించనున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో నాగ శౌర్య అక్షరాల 7 గెటప్పుల్లో కనిపించబోతున్నాడని సమాచారం. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వయంగా నాగశౌర్య బయట పెట్టడం విశేషం.

“ప్రస్తుతం అశ్వద్ధామ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాను. దీనికి ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ సినిమాలో నేను ఒకటి రెండు కాదు 7 గెటప్పుల్లో కనిపిస్తాను” అని నాగ శౌర్య తెలిపాడు. ఇంతకుముందు అవసరాల శ్రీనివాస్ నాగశౌర్య కాంబినేషన్ లో విడుదలైన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ సినిమా పై కూడా అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -