Friday, April 26, 2024
- Advertisement -

నాగబాబు ఒకేసారి అంత బరువు తగ్గడానికి రీజన్ ఏంటో తెలుసా ?

- Advertisement -

సినిమాల్లోను.. బుల్లితెరపై షోస్ లోనూ తన దైన శైలిలో రాణిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా ఉంటూ సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అయితే ఇటీవలే నాగబాబు లుక్స్ పరంగా చాలా మారిపోయాడు. బరువు తగ్గిపోయి సన్నగా కనిపిస్తున్నారు అసలు నాగబాబును చూసి ఫ్యాన్స్ కూడా బాబు గారికి ఏమైంది అని ఆలోచిస్తున్నారు. ఈయనేంటి బరువు తగ్గి ఇంతగా మారిపోయాడు అంటూ షాక్ అవుతున్నారు.

గత ఎన్నికల్లో బొద్దుగా కనిపించిన నాగబాబు ఎంత తక్కువ టైంలో ఇంత సన్నగా ఎలా మారిపోయాడంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ముందుటి ఫొటోస్ తో ఇప్పటి ఫొటోస్ కంపేర్ చేసి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. అయితే ఏదైనా బారియాట్రిక్ లాంటి సర్జరీలు చేయించుకొని అలా మారిపోయాడా అని కొందరు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేసిన వీడియోలలో.. లాక్ డౌన్ లో వరుణ్ తేజ్ – నిహారికా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ లో ఆయన్ని చూసిన వారికి సన్నగా కనిపించడమే కాకుండా.. తలపై వెంట్రుకలు కూడా ఊడిపోయాయనే విషయం అర్థం అవుతుంది.

నాగబాబు అకస్మాత్తుగా ఇంత బరువు తగ్గడంతో మెగా బ్రదర్ ఆరోగ్యం బాగానే ఉందా అని మెగా అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల దీనిపై స్పందించిన నాగబాబు.. కొన్ని సహజ మార్గలతోనే బరువు తగ్గినట్లు తెలిపాడు. ఈ డైట్ జులై వరకు కొనసాగిస్తానని చెప్పాడు. నా డైట్ వల్లే ఒక్కసారిగా బరువు తగ్గానని చెప్పాడు. అయితే నాగబాబు డైట్ ఫాలో అయ్యి సన్నబడటం బానే ఉంది కానీ ఒకేసారి 30 నుండి 40 కేజీల బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -