Friday, April 26, 2024
- Advertisement -

ముద్దు పెట్టాడా? ..లేక పెట్టించుకుందా?

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ అంటే ఛోటా కె నాయుడే.దాదాపు అంద‌రి హీరోల‌తో ప‌నిచేశాడు చోటా.తెలుగు ఇండ‌స్ట్రీలో భారీ బ‌డ్జెట్ సినిమాలు అన్నింటికి మ‌నోడే ప‌నిచేస్తుంటాడు.అయితే అత‌ను చేసిన ఓ చిన్న ప‌నితో వార్త‌ల్లో నిలిచాడు.బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టిస్తున్న క‌వ‌చం సినిమా టీజ‌ర్ ఈవెంట్ నిన్న (సోమవారం) హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది.ఈవెంట్‌లో హీరోయిన్‌ కాజ‌ల్ మాట్లాడుతూ… చోటాను ఆకాశానికి ఎత్తిసేంది. ఆనందంలో చోటా ప‌బ్లిక్‌గానే కాజ‌ల్‌కు ముద్దు పెట్టాడు.దీంతో అక్క‌డ ఉన్నావారంద‌రు షాక్ అయ్యారు.మొద‌ట కాజ‌ల్ కూడా చోటా చేసిన ప‌నికి షాక్ అయింది.

వెంట‌నే తెరుకుని చోటా మా ఫ్యామిలీ మెంబ‌ర్‌తో స‌మానం అంటూ క‌వ‌ర్ చేసింది.అయితే చోటా చేసిన ప‌నిపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఛోటా కె నాయుడుని బ్యాన్ చేయాలని కోరుతున్నారు కాజల్ అగర్వాల్ అభిమానులు. పబ్లిక్ గా స్టేజ్ మీద ఆమె ప్రమేయం లేకుండా కాజల్ కి ముద్దు పెడతావా..? ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదా..? అంటూ ఛోటాపై మండిపడుతున్నారు. ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం మంది ఛోటా చేసిన పనికి ఛీ కొడుతున్నారు.అయితే మ‌రికొంద‌రు దీనిని చాలా సింపుల్‌గా తీసుకుంటున్నారు.అస‌లు ఈ స‌న్నివేశం చూసి కాజ‌ల్‌కు ముద్దు పెట్టాడా? లేక కాజ‌లే కావ‌ల‌ని ముద్దు పెట్టించుకుందా? అంటూ మ‌రికొంద‌రు నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -