Saturday, April 27, 2024
- Advertisement -

‘బిగ్‌బాస్’ మూడో సీజ‌న్‌కు యాంక‌రింగ్ చేస్తుంది ఆ హీరోనే..!

- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌కు రంగం సిద్దం అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సీజ‌న్ల‌ను ఘ‌నం పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ , మూడో సీజ‌న్‌కు స‌ర్వం స‌న్న‌ద్దం చేసుకుంటుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మూడో సీజ‌న్‌కు ఎవ‌రు యాంక‌రింగ్ చేస్తున్నారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సీజ‌న్‌కు ఓ యాంక‌రింగ్‌ను మార్చ‌డం తెలుగులోనే జ‌రిగింది. బాలీవుడ్‌లో మొద‌టి నుంచి స‌ల్మాన్ ఖానే యాంక‌రింగ్ చేస్తున్నారు. తమిళంలో క‌మ‌ల్ హాస‌న్‌, మళ‌యాళంలో మోహ‌న్ లాల్ ఇలా అన్ని సీజ‌న్‌ల‌కు ఒక్క‌రే యాంక‌రింగ్ చేస్తున్నారు.

కాని తెలుగులో మొద‌టి సీజ‌న్‌కు ఎన్టీఆర్ యాంక‌రింగ్ చేయ‌గా, రెండో సీజ‌న్‌కు నాని వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హారించాడు. ఇప్పుడు మూడో సీజ‌న్ టైమ్ వ‌చ్చింది. ఈ సీజ‌న్‌కు యాంక‌రింగ్ ఎవ‌రు చేస్తార‌నే దానిపై క్లారిటీ లేదు. మొద‌టి సీజ‌న్‌కు యాంక‌రింగ్ చేసిన ఎన్టీఆర్ ‘RRR’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీంతో అత‌ను మూడో సీజ‌న్‌కు యాంక‌రింగ్ చేసే అవ‌కాశం లేదు. ఇక నాని ఇలాంటి షోలు భ‌విష్య‌త్తులో చేయ‌న‌ని అప్పుడే చెప్పేశారు. దీంతో మూడో సీజ‌న్ యాంక‌రింగ్ చేసేది ఎవ‌రా అనే దానిపై చాలామంది పేర్లు వినిపించాయి. టాలీవుడ్ స‌న్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు, సీనియర్ హీరో వెంక‌టేశ్ పేర్లు బాగా వినిపించాయి.

తాజాగా ఈ లిస్ట్‌లోకి మ‌రో హీరో వ‌చ్చి చేరాడు. ఆ హీరో మ‌రెవ్వ‌రో కాదు… మ‌న కింగ్ నాగ‌ర్జున‌. అవును నాగ‌ర్జున బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌కు యాంక‌రింగ్ చేసే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే బిగ్‌బాస్ యాజ‌మాన్యం నాగ‌ర్జున‌ను క‌లిసి మాట్లాడ‌ర‌ని స‌మాచారం. దీనిపై నాగ్ కూడా సానుకులంగానే స్పందించార‌ట‌. గ‌తంలో నాగ్‌కు ఇలాంటి షోలు చేసిన అనుభ‌వం ఉంది. మీలో ఎవ‌రు కోటేశ్వ‌రుడు అనే షోలో యాంక‌రింగ్ చేశాడు నాగ్. నాగ్ యాంక‌రింగ్ చేసిన‌ప్పుడు ఈ షోకి మంచి రేటింగ్స్ వ‌చ్చేవి. ఈ అనుభ‌వంతోనే బిగ్‌బాస్ యాజ‌మాన్యం నాగ్‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. మొత్త‌నికి నాగ్‌ను మూడో సీజ‌న్‌కు తీసుకురావ‌డం ద్వారా షోకి విప‌రీత‌మైన రేటింగ్స్ తీసుకురావచ్చ‌నే ఆలోచ‌న‌లో ఉంది బిగ్‌బాస్ యాజ‌మాన్యం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -