Saturday, April 27, 2024
- Advertisement -

నిరుపమ్ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారంటే ?

- Advertisement -

నిరుపమ్ పరిటాల ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. 3 సీరియల్ షూటింగ్ లో నెలంత బిజీ బిజీగా ఉండే నిరుపమ్ సంక్రాంతికి కాస్త బ్రేక్ దొరకడంతో తన భార్య కొడుకుతో కలిసి సింగపూర్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు.

తమ సింగపూర్ వెకేషన్ కి సంబంధించిన ఫొటోస్ ని మంజుల నిరుపమ్ తమ ఇన్‍స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోస్ చూసిన వారంతా సూపర్బ్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం నిరుపమ్ కార్తీకదీపం ప్రేమ కుంకుమ పువ్వు సీరియల్స్ లో నటిస్తున్నాడు. మూడు సీరియల్స్ కూడా విశేషమైన ఆదరణతో ముందుకు వెళుతున్నాయి. ఇక కార్తీకదీపం సీరియల్ గురించి అయితే వేరే చెప్పక్కర్లేదు. 8.7 టిఆర్పి రేటింగ్ తో టాప్ లో కొనసాగుతోంది.

ఆ సీరియల్ దరిదాపుల్లో కూడా వేరే సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లేవనే చెప్పాలి. డాక్టర్ బాబు, వంటలక్క ఎమోషన్స్ కి ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. నిరుపమ్ కార్తిక్ గా, డాక్టర్ బాబుగా తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇలా వరుస షూటింగ్తో నెలంత బిజీగా ఉండే నిరుపమ్ కాస్త బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -