‘పప్పులాంటి అబ్బాయి’ పాట విడుదల చేసిన వర్మ

694
Pappu Laanti Abbayi Song from Kamma Rajyam Lo Kadapa Reddlu Movie
Pappu Laanti Abbayi Song from Kamma Rajyam Lo Kadapa Reddlu Movie

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ’పప్పులాంటి అబ్బాయ’ పాటతో మరో వివాదం రేపేలా ఉన్నారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలోంచి పప్పులాంటి అబ్బాయి పాటను విడుదల చేశారు.

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లులోని పప్పులాంటి అబ్బాయి పాట ఇదిగో.. ఇది తండ్రీకొడుకుల ప్రేమను తెలిపే పాట. ఇందులో తొలి పార్ట్ తండ్రి కోణంలో, రెండో పార్ట్ కుమారుడి కోణంలో ఉంటుంది. ఈ పాత్రలు ఎవరినైనా పోలి ఉన్నాయని మీకనిపిస్తే ఇది కేవలం యాధృచ్ఛికం మాత్రమే’ అని పేర్కొన్నారు.

ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పలు పోస్టర్ లను విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ కూడా విడుదలైన విషయం తెలిసిందే.

Loading...