Friday, April 26, 2024
- Advertisement -

వరుణ్ సినిమా నుండి పూజ హెగ్డే వాకౌట్

- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాల తో బిజీ గా గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఒకటి కిరణ్ కొర్రపాటి దర్శకత్వo లో బాక్సింగ్ నేపథ్యం లో సినిమా కాగా మరొకటి తమిళ్ సూపర్ హిట్ చిత్రం జిగర్తండా కి రీమేక్ గా వస్తున్న వాల్మీకి. ఈ సినిమా కి హరీష్ శనకర్ దర్శకుడు. అయితే ఈ సినిమా మీద ఇటీవలే కొన్ని పుకార్లు వచ్చాయి. సినిమా లో హీరోయిన్ గా చేస్తున్న పూజ హెగ్డే కి పారితోషికం నచ్చలేదు అని, అదే విషయమై నిర్మాతల తో కోల్డ్ వార్ లో ఉంది అని వార్తలు వస్తే, సినిమా దర్శకుడు హరీష్ శంకర్ అలాంటిదేమి లేదు అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.

అయితే తాజా ఫిలిం నగర్ కబుర్ల ప్రకారం పూజ హెగ్డే ఈ సినిమా నుండి వైదొలిగింది అని తెలుస్తుంది. ఈ సినిమా కి నిజానికి పూజ తన డేట్స్ ని అడ్జెస్ట్ చేయలేని స్థితి లో ఉంది అంట, కానీ పారితోషికం మంచి గా ఉంటె కచ్చితంగా ఈ సినిమా చేయాలనీ అనుకుంది అంట కానీ చివరికి నిర్మాతలు తను చెప్పిన అమౌంట్ ని ఇవ్వలేమని చేతులు ఎత్తేయడం తో పూజ సినిమా నుండి బయటకు వచ్చేసింది అని టాక్. దీని పై త్వరలో మేకర్స్ ఒక అఫీషియల్ అనౌన్సమెంట్ చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -