మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్..!!

711
prabhas gift to his fitnewss trainer
prabhas gift to his fitnewss trainer

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఔదార్యం గురించి అందరికి తెలిసిందే.. తన తో పనిచేసిన వారికి అయన ఎప్పుడు మంచి చేయాలనే చూస్తుంటాడు. వారికి ఎప్పటికప్పుడు బహుమతులు లు ఇస్తూ వారికి మరింత దగ్గరవుతుంటాడు.. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌భాస్ త‌న ట్రెయిన‌ర్‌కు ఓ విలాస‌వంత‌మైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.

ప్ర‌భాస్ త‌న ఫిట్‌నెస్ ట్రెయిన‌ర్ ల‌క్ష్మ‌ణ్ రెడ్డికి ఓ రేంజ్ రోవ‌ర్ కార్‌ను తాజాగా బ‌హుక‌రించాడు. దాని విలువ కొన్ని ల‌క్ష‌ల రూపాయ‌లు ఉంటుంది. అయితే ఆ గిఫ్ట్‌ను అందుకున్న ల‌క్ష్మ‌ణ్ రెడ్డి ఎంతో హ్యాపీగా ఫీల‌య్యాడు. ప్ర‌భాస్ త‌న‌కు అంత భారీ బ‌హుమ‌తి ఇచ్చినందుకు ఖుషీ అయ్యాడు. అయితే ప్ర‌భాస్ అత‌నికి ఆ కారును థ్యాంక్స్ గివింగ్ పేరిట గిఫ్ట్‌గా అందించాడు.

ఇక ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆది పురుష్ కాకుండా పూజా హెగ్డెతో రాధే శ్యాం అనే మూవీ చేస్తున్నాడు. నాగ్ అశ్విన్‌తో క‌లిసి దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా మ‌రో మూవీ చేస్తున్నాడు. రాధేశ్యాం 2021లో థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. దీన్ని తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ళ‌యాళం భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో భాగ్య‌శ్రీ‌, ముర‌ళీ శ‌ర్మ‌, స‌చిన్ ఖెడెక‌ర్‌, కునాల్ రాయ్ క‌పూర్‌, ప్రియ‌ద‌ర్శి, సాషా ఛెత్రి, స‌త్య‌న్‌లు కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు. దీన్ని కేకే రాధాకృష్ణ తెరకెక్కిస్తుండ‌గా.. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గోపీ కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

Loading...