Friday, April 26, 2024
- Advertisement -

అనుష్క విషయంలో నోరు జారిన ప్ర‌భాస్‌

- Advertisement -

బాహుబ‌లి సినిమాతో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది.ప్రభాస్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే బాహుబ‌లికి ముందు బాహుబ‌లికి త‌రువాత అని చెప్పుకోవాలి.ప్ర‌భాస్ ఈ సినిమాతో నేష‌న‌ల్ స్టార్‌గా మారిపోయాడు.బాలీవుడ్‌లో కూడా ప్ర‌భాస్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.ఇక ప్ర‌భాస్ ఇప్ప‌టి వ‌రకు టీవీ షోలలో పాల్గొన్న‌ది లేదు.అలాంటి ప్ర‌భాస్‌ను త‌న షోకి వ‌చ్చేలా చేశాడు బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహ‌ర్‌.ఈ షోకి ప్ర‌భాస్‌తో పాటు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి,రానాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్.. ప్రభాస్ ని ప్రశ్నిస్తూ.. ‘నువ్వు దేవసేన అనుష్కతో డేటింగ్ లో ఉన్నావని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజమా..? కాదా..?” అని అడగగా.. దానికి ప్రభాస్ ‘లేదు’ అన్నారు. ‘కానీ గుసగుసలు వినిపిస్తున్నాయి కదా..’ అని ప్రభాస్ అడగగా.. ‘ఇవి మొదలుపెట్టింది మీరే’ అని చమత్కరించాడు. అయితే ఈ స‌మాధానంపై క‌ర‌ణ్ మాట్లాడుతు..నువ్వు నాకు అబ‌ద్దాలు చెప్పావు కాదా అని అడ‌గ్గా ప్ర‌భాస్ నుంచి అవున‌నే స‌మాధానం వ‌చ్చింది.దీంతో అక్క‌డ ఉన్న వారితో పాటు షో చూస్తున్న వారికి కూడా క్లారిటీ వ‌చ్చేసింది.గ‌త కొంత‌కాలంగా ప్ర‌భాస్ అనుష్క‌లు ప్రేమ‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.వాటిని అటు అనుష్క‌,ఇటు ప్ర‌భాస్ ఇద్ద‌రు ఖండించారు.అయినప్ప‌టికి వారి గురించి గుస‌గుస‌లు వినిపిస్తునే ఉన్నాయి.మ‌రి ప్ర‌భాస్ చెప్పిన ఈ ఒక్క మాట ఎంత దూరం వెళ్లుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -