Friday, April 26, 2024
- Advertisement -

మంగళసూత్రంతో హీరోయిన్ సెల్ఫీ

- Advertisement -

ప్రియాంక చోప్రాను ఏమాని పిల‌వ‌లో జ‌నాల‌కి అర్థం కావ‌డం లేదు. మాజీ మిస్ ఇండియా అని పిల‌వలా? లేక బాలీవుడ్ హీరోయిన్ అని పిల‌వ‌లా? లేక మిసెస్ నిక్ అని పిలవలో ఎవ్వరికి అర్థం కావ‌డం లేదు. అయితే తన‌ని ఏమ‌ని పిల‌వ‌లో క్లారిటీ ఇచ్చింది ప్రియాంక‌. త‌న‌ని మిసెస్ నిక్ అనే పిల‌వాల‌ని ఒక సెల్ఫీతో క‌న్ఫ‌ర్మ్ చేసింది. అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ అయిన నిక్ జోన‌స్‌ను గ‌త ఏడాది ప్రేమ వివాహం చేసుకుంది ప్రియాంక‌.

పెళ్లి త‌రువాత బాలీవుడ్‌లో సినిమాలు చేయ‌డం లేదు. హాలీవుడ్‌లో ఓ టీవీ సిరీస్‌లో మాత్రమే న‌టిస్తుంది. ఇక భ‌ర్త నిక్‌తో క‌లిసి లండ‌న్ విధుల్లో చ‌క్క‌ర్తు కొడుతోంది ఈ హాట్ బ్యూటీ. ప్రియాంక ఈమధ్య ఒక విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫోటోలో ప్రియాంక త‌న మంగళసూత్రన్ని బ‌య‌ట‌పెట్టింది.నిమ్మపండు రంగు టీ షర్ట్.. కళ్ళకు ఆధునికత ఉట్టిపడే కళ్ళజోడు అంతా అల్ట్రాస్టైలిష్‌గా ఉంది.


వేరే దేశ‌స్థుడిని పెళ్లి చేసుకున్న‌ప్ప‌టికితాను భారతీయ మహిళ అన్నట్టుగా ప్రియాంక మేడ‌లో తాళిబొట్టు క‌నిపించింది. దీంతో చాలామంది ప్రియాంక‌ను ప్ర‌శంసిస్తున్నారు. అమెరికా కోడలయినా ఇలా భారతీయతను గుర్తు చేసేలా మంగళ సూత్రం ధరించడం గొప్ప విషయం అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -