హైదరాబాద్ కి తిరుగు ముఖం పడుతున్న రామ్..

396
Puri Jagannadh-Charmy Kaur Tweets On Ram Pothineni Goes Viral
Puri Jagannadh-Charmy Kaur Tweets On Ram Pothineni Goes Viral

ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదల కి నాలుగు రోజుల ముందు నుంచి సినిమా హీరో రామ్ మాయమయ్యాడు. విహార యాత్ర కి అని చెప్పి రామ్ ప్రమోషన్స్ నుంచి తప్పించుకున్నాడు. సినిమా విడుదల అయ్యి పెద్ద హిట్ అయింది. కానీ రామ్ జాడ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యం లో రామ్ తన విహార యాత్ర ని ముగించుకొని మరో రెండు రోజుల్లో హైదరాబాద్ చేరుకోనున్నారు.

ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఛార్మి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. “మరొక రెండు రోజుల్లో ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ హైదరాబాద్ కి తిరిగి రానున్నాడు. రామ్ వచ్చి మా అందరి తో పాటు ఇస్మార్ట్ శంకర్ క్రేజ్ ని ఆస్వాదించనున్నాడు. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాము.” అని ప్రకటించింది.

ఈ ట్వీట్ ని కోట్ చేస్తూ పూరి జగన్ కూడా ఒక ట్వీట్ వేశారు. “మేరా కిరాక్ ఇస్మార్ట్.. నిన్ను కౌగిలించుకోవడానికి ఎదురు చూస్తున్నాను. కలిసి సినిమా విజయం ఆస్వాదిద్దాం.” అన్నాడు.

రామ్ కూడా ఇదే విషయాన్ని చెప్తూ, “ఆన్ మై వే” అని ప్రకటించాడు.

ఇక రామ్ వచ్చాక సినిమా యూనిట్ విజయోత్సవ యాత్ర చేపట్టనున్నారు అని సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు.

Loading...