Saturday, April 27, 2024
- Advertisement -

బిగ్ బాస్ ను బూతులు తిట్టిన రాహుల్.. ఎందుకు ?

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ కు రాహుల్ ఓ కంటెస్టెంట్ గా వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. సోషల్ మీడియాలో అతనికి రాహుల్ ఆర్మీ కూడా ఉంది. హౌస్ లో అతను వరుణ్, వితిక, పునర్నవి లతో బాగా క్లోజ్ గా ఉన్నాడు. పునర్నవితో అయితే ఏకంగా ప్రేమలో పడిపోయాడా అన్న అనుమానాలు కలిగేలా ఆమెతో క్లోజ్ గా ఉన్నాడు. పునర్నవి కూడా రాహుల్ పై తన ఇష్టాన్ని చూపించింది. ఇక శ్రీముఖికి, రాహుల్ కి అసలు పడటం లేదు.

చాలా ఎపిసోడ్ ల్లో వీరిద్దరు వివాదస్పదమైన మాటలు కూడా అనుకున్నారు. ఇక ఇటివలే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలిచి ఫైనల్ రౌండ్ కి డైరెక్ట్ గా వెళ్లాడు రాహుల్. అలాంటి రాహుల్ ఇప్పుడు బిగ్ బాస్ ను తిట్టాడం ఏంటి అనుకుంటున్నారా ? నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించిన ఇది జరిగింది. మూడేళ్ల కింద చేసిన ఓ పని ఇప్పుడు రాహుల్ పై నెగిటివ్ షేడ్ ను తీసుకొచ్చింది.

ఒకప్పుడు బిగ్ బాస్ షోను రాహుల్ బండ బూతులు తిట్టిన వీడియో ఒక్కటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుడు ఏ సందర్భంలో చేశాడో కానీ అదే ఇప్పుడు రాహుల్ మెడకు చుట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 1లోకి దీక్షా పంత్ అనే హీరోయిన్ వచ్చింది. అప్పుడు ఆమెతో మంగమ్మ అనే సాంగ్ చేశాడు రాహుల్. ఆ పాటను బిగ్ బాస్ సీజన్ 1లో ప్లే చేశారు.

ఆ పాట బిన్న తర్వాత ఏంటి పిచ్చి పాట అంటూ అక్కడ అంతా విమర్శించారు. దాంతో అప్పుడు మనోడు బాగానే రియాక్ట్ అయ్యాడు. బూతులు తిడుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. తన పాటనే తిడుతారా అని పిచ్చి బూతులతో రెచ్చిపోయాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -