Friday, April 26, 2024
- Advertisement -

ప్యాకెట్ మ‌నీ కోస‌మే ‘హీరోయిన్’ అయ్యా

- Advertisement -

టాలీవుడ్‌లో అవ‌కాశాలు బాగా ఉన్న స‌మ‌యంలోనే బాలీవుడ్‌కు వెళ్లి ప‌రాభ‌వం ఎదుర్కొన్న హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌. ఈ అమ్మ‌డు త‌న‌కు తెలుగు బాగా క‌లిసొచ్చింద‌ని గుర్తించి మ‌ళ్లీ బ్యాక్ వ‌చ్చేసింది. ఇక అభిమానుల‌కు ద‌గ్గ‌ర కావాల‌ని చెబుతూ త‌న పేరిట ఓ యాప్‌ను వ్య‌క్తిగ‌తంగా రూపొందించి అభిమానుల‌కు చెప్పింది. అయితే ఈ యాప్ విడుద‌ల స‌మ‌యంలో మీడియాతో మాట్లాడింది. ఆ స‌మ‌యంలో త‌న‌కు కావాల్సిన మొగుడు ఎలా ఉండాలి? ఏం కోరుకుంటుందో చెప్పింది. దాంతో పాటు కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పేసింది.

త‌న‌కు ఎలాంటి మగాడు మీకు నచ్చుతాడు అని ప‌శ్నించ‌గా తన ఎత్తు 5.9 అడుగులు అని అంతకు మించిన ఎత్తు కలిగిన వ్య‌క్తి త‌న‌కు న‌చ్చుతాడు అని తెలిపింది. తాను ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. చిన్నతనంలోనే త‌న‌కు భక్తి పుస్తకాలు ఇష్టమ‌ని, వాటిని తెగ‌ చదివేదాన్ని అని చెప్పింది. అవే త‌న‌ మనసులో ఆధ్యాత్మిక చింతన కలిగించి ఇప్పుడు ఆ వైపు దారి వెళ్తోంద‌ని పేర్కొంది.

త‌ను హీరోయిన్‌ను కావాలని కోరుకోలేదని ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త చెప్పింది. పాకెట్‌ మనీ కోసమే తాను హీరోయిన్‌గా నటించడానికి వచ్చాను అని చెప్పింది. కెమెరా ముందుకు వచ్చిన తరువాతే నటనను కొనసాగించాను. అభిమానుల ఆదరణ ఉన్నంత వరకూ సినిమాల్లో కొన‌సాగుతాన‌ని చెప్పింది. ఇక సినిమాలు వ‌దిలేసిన త‌ర్వాత ర‌కుల్ హైద‌రాబాద్‌లోనే స్థిర‌ప‌డేలా ఏర్పాట్లు చేసుకుంది. దానికి అనుగుణంగా విదేశీ నిపుణులతో కలిసి హైదరాబాద్‌లో జిమ్‌ను ప్రారంభించింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -