Friday, April 26, 2024
- Advertisement -

మా అమ్మ బికినీ వేస్తే తప్పులేదంది : రకుల్ ప్రీత్

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్.. మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టి కన్నడ చిత్రం గిల్లి తో హీరోయిన్ అయింది. ఇక ఈమె తెలుగులో కెరటం సినిమా ద్వారా పరిచయం కాగా.. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో మంచి క్రేజ్ సంపాధించుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో ఈమెకు వరస ఆఫర్స్ వచ్చాయి.

మహేష్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ వంటి అందరు టాప్ స్టార్స్ తో రకుల్ నటిచింది. ఈ మధ్య హిందీపై ఫోకస్ పెట్టడంతో, తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఈమె గతేడాది హిందీలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా దే దే ప్యార్ దే అనే సినిమాలో నటించింది. అయితే ఈమె తెలుగులో మరి శృతి మించిన గ్లామర్ రోల్స్ చేయలేదు. ఐతే రకుల్ కి బికినీ వేయడం సమస్యేం కాదు అంటుంది. రకుల్ ప్రీత్ మథర్ స్వయంగా బికినీ వేసుకోవడంలో ఎంకరేజ్ చేస్తారట.

రకుల్ ఫెమీనా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొనాల్సి ఉండగా బికినీ వేయాల్సి వస్తుందని బాధపడిందట. అదే విషయం వాళ్ళ అమ్మతో చెవితే బికినీ వేయడంలో తప్పేంటి అన్నారట. అలా రకుల్ ని వాళ్ళ అమ్మ ఎంకరేజ్ చేసి ఫెమీనా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొనేలా చేసిందట. 2011 లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా కాంటెస్ట్ లో రకుల్ 5వ స్థానంలో నిలిచింది. అలాగే ఆమె ఈ కాంటెస్ట్ లో పీపుల్స్ ఛాయిస్ అవార్డుతో పాటు, ఐదు అవార్డ్స్ గెలుచుకుంది. కాబట్టి బికినీ ధరించే విషయంలో తనకు కుటుంబం నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని రకుల్ చెబుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -