Friday, April 26, 2024
- Advertisement -

చరణ్, ఉపాసన ఇప్పుడే పిల్లలు వద్దు అనుకోవడానికి రీజన్ ఇదే..!

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లిలు చాలా లేటుగా చేసుకుంటారు. హీరో, హీరోయిన్స్ మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా తొందరగా పెళ్లిల జోలికి వెళ్ళరు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం.. కరెక్ట్ టైంకే పెళ్లి చేసుకున్నాడు. . 35 ఏళ్ల వయసున్న రాంచరణ్ కు 8 ఏళ్ల క్రితమే ఉపాసనతో పెళ్లయ్యింది. వీరిద్దరూ టాలీవుడ్ ఆదర్శ దంపతులలో ఒకరుగా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.

అయితే ‘8 ఏళ్లయినా ఇంకా ఎందుకు వీరికి పిల్లలు లేరు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇందుకు గల రీజన్ ఉపాసన అలానే చరణ్ చెప్పకనే చెప్పారు. ఉపాసన మాట్లాడుతూ.. ” పిల్లలు, ప్రెగ్నెన్సీ అనేది కంప్లీట్ గా మా పర్సనల్ విషయం. అలాగే నాకు ప్రెగ్నెన్సీ అంటే కొంత భయం ఉంది. నేను ఇప్పుడిప్పుడే లావు తగ్గుతున్నాను. చరణ్ కు నాకు ఓ ప్లాన్ ఉంది. పిల్లల్ని ఎప్పుడు కనాలనే విషయంలో మాకు ఓ క్లారిటీ ఉంది” అని ఉపాసన ఎప్పుడో చెప్పింది.

ఇక చరణ్ కూడా.. “మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా నేను అభిమానుల్ని సంతృప్తి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అప్పుడే కంప్లీట్ ఫ్యామిలీ మెన్ గా మారితే నేను డీవియేట్ అవ్వొచ్చు. అంతేకాక ఉపాసనకు కూడా కొన్ని గోల్స్ ఉన్నాయి. అందుకే కొన్నాళ్ల పాటు మేము పిల్లల్ని వద్దు అనుకుంటున్నాం” అని చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. అలానే మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య మూవీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -