మిహీకా తల్లిదండ్రులకు పెళ్లికి ముందే షాక్ ఇచ్చిన రానా..!

478
Rana Daggubati on love story with Miheeka Bajaj
Rana Daggubati on love story with Miheeka Bajaj

దగ్గుబాటి రానా ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. తనకు కాబోయే భార్య మిహీకాను ఇటీవలే సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశాడు రానా. మిహీకాను పరిచయం చేసిన నిమిషాల్లోనే ఆ వార్త వైరల్ అయింది. ఇక తాజాగా ఇరుకుటుంబాలు రోకా వేడుక(కుటుంబాల కలయిక) కూడా జరిగింది. ఈ వేడుకలోని ఫోటోలని అక్కినేని కోడలు సమంత సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ఇప్పటికే రానా- మిహీక రోకా వేడుక ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

ఇక రానాకు మిహీకాతో స్నేహం ఎలా కుదిరింది ? ఎప్పుడు ప్రేమలో పడ్డాడు ? అని అడిగితే అసక్తికర విషయాలు చెప్పాడు. ’లాక్డ్ అప్ విత్ లక్ష్మి` (ఇన్ స్టా) షోలో లక్ష్మి మంచు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు రానా. మిహీక తనకు చాలా కాలంగా తెలుసునని ఎందుకంటే తన సోదరి దగ్గుబాటి ఆశ్రితకు క్లాస్ మేట్ అని కూడా చెప్పాడు. తనతో చాలా కాలం స్నేహం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని లవ్ లో పడ్డారట. అటుపై రానా ప్రపోజ్ చేసిన తీరు కూడా ఇంట్రెస్టింగ్. అబ్బాయికి అమ్మాయి నచ్చితే ముందుగా ఏదైన ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేశ్తారు. ఇది అందరికి తెలిసిందే.

అయితే రానా డిఫరెంట్ గా ప్రపోజ్ చేశాడట. అతడు నేరుగా మిహీక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను కలిసాడట. ఉన్న విషయం కాస్తా చెప్పేశాడట. ఈ ప్రపోజల్ కి అత్తమామలు షాక్ తిన్నారట. ఆ తర్వాత మిహీకను కన్విన్స్ చేసేశాడట. అయితే చాలా కాలం స్నేహం వల్ల ఒకరికొకరు అర్థం చేసుకున్న తర్వాతనే ప్రేమలో పడ్డారని రానా ఇచ్చిన హింట్ రివీల్ చేసింది. అలాగే హీరో వెంకటేష్ కూతురు ఆశ్రితకు స్నేహితురాలు కాబట్టే తనకు స్నేహితురాలు అయ్యింది మిహీక. సో రానాకు అలా అన్ని విధాలుగా కలిసి వచ్చింది.

Loading...