Friday, April 26, 2024
- Advertisement -

రాజా ది గ్రేట్ చిత్రం.. ఓకే అనిపించుకుందా..

- Advertisement -

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన రాజా ది గ్రేట్ చిత్రం.. ఓకే అనిపించుకుంది. లాజిక్కులు మిస్ అయినా.. మ్యాజిక్ స్క్రిప్ట్ తో అనీల్ రావిపూడి ఫిలిమ్ ను పండించేశాడు. దిల్ రాజు అంచనాలు ఎక్కడా తప్పలేదు. సినిమాలో గుడ్డివాడే హీరో కబడ్డీ ఆడటం, ఫైట్ లు గట్రా చేయడం.. గున్నగున్న మామిడి లాంటి మాస్ పాటకు మాస్ రాజా డ్యాన్స్ చేయడం.. ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి.

సినిమా ఆద్యంతం చాలా ఎంటర్టైనింగ్ గా సాగడం ‘రాజా ది గ్రేట్’లో భాగా చెప్పుకోవల్సిన విషయాలు. హీరో బ్లైండ్ అయినప్పుడు సెంటిమెంట్ సీన్లు లాంటివి మనం అస్సలు ఎక్స్ పెక్ట్ చేయకూడదు. ఈ సినిమాలో వచ్చే బ్యాంకులో దొంగతనం సీన్ లో … బ్యాంకు మేనేజర్ ఏం అడిగినా ‘ఏమో సార్ నాకు కనబడదు’ అంటూ హీరో ఒకటే డైలాగ్ రిపీట్ చేస్తుంటాడు . అది మంచిగా పండింది. సినిమాలో హీరో విలన్ కు సవాలు విసురుతూ.. ‘‘నా ముందుకొచ్చి వినబడు’’ అంటాడు.

ఈ తరహా చమక్కులు చక్కగా పేలాయి చిత్రంలో. రవితేజ-శ్రీనివాసరెడ్డి కాంబినేషన్లో నడిచే కామెడీ సూపర్బ్ గా పేలింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే అంశాల్ని ఎంతో పొందికగా స్క్రిప్టులో చేర్చాడు అనిల్ రావిపూడి. ‘రాజా ది గ్రేట్’కు సినిమాకు మెయిన్ అస్సెట్ ఫస్ట్ పార్టే అని చెప్పాలి. డార్జిలింగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఎపిసోడ్ సరదాగా సాగిపోతుంది. మొదటి భాగంలో మాస్ రాజా ఎంటర్టైన్మెంట్ చేస్తే .. డార్జిలింగ్ ఎపిసోడ్లో రాజేంద్ర ప్రసాద్.. అన్నపూర్ణమ్మ.. పృథ్వీ లీడ్ తీసుకుని కొంతసేపు ప్రేక్షకులను ఊపేసారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -