Saturday, April 27, 2024
- Advertisement -

శృతి హాసన్ బ్రేక్ తీసుకోవడం వెనుక కారణం

- Advertisement -

శృతి హాసన్ ఇండస్ట్రీ లో కి అడుగు పెట్టి నేటి తో పదేళ్లు అవుతుంది. అయితే శృతి ముందుగా ఒక హిందీ సినిమా తో తెరంగేట్రం చేసింది. హిందీ లో అడుగు పెట్టిన రెండేళ్ళకి గానీ తెలుగు లో సినిమా చేయలేదు. ఈ పదేళ్ల లో చాలా నేర్చుకున్నాను అని, తను బ్రేక్ తీసుకోవడానికి గల కారణాలని శృతి తెలిపింది.

“ఈ రోజు తో నేను సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో చాలా విషయాలు నేర్చుకున్నాను.నేను ఇంకా కష్ట పడి పని చేస్తాను అని మీ అందరికీ మాట ఇస్తున్నాను. నాకు ఈ జర్నీ లో సపోర్ట్ చేసిన వాళ్ళ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఒక నటి గా నన్ను నేను మార్చుకునేందుకు సినిమాలు దోహదపడ్డాయి. అదే విధం గా నేను ఆ మధ్య ఒక సంవత్సరం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రొఫెషనల్ గా నాకు ఆ సంవత్సరం చాలా ఉపయోగపడింది. నా వ్యక్తిగత మరియు సినిమా జీవితం గురించి నన్ను నేను అధ్యాయనం చేసుకోవడానికి ఆ సమయం నాకు చాలా ఉపయోగపడింది. ఈ ప్రయాణం లో నాకు తోడ్పాటు గా నిలిచి, నాకు చేయూత ని ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు.” అని శృతి హాసన్ తెలియజేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -