Friday, March 29, 2024
- Advertisement -

చేపమందు పంపిణీ పై బత్తిని బ్రదర్స్ సంచలన నిర్ణయం!

- Advertisement -

ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజు హైదరాబాద్ లో చేప మందు పంపిణీ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే గత ఏడాది నుంచి కరోనా వైరస్ ఎంతా ఇబ్బందులు పెడుతుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గినా.. లాక్ డౌన్ మాత్రం కంటిన్యూ అవుతోంది. వేసవి కాలంలో కేసులు ఎక్కువ వస్తున్నందున ప్రభుత్వం మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది.

ఈ ఏడాది చేపమందు ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. లాక్ డౌన్, కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సారి చేపమందు ప్రసాదం పంపిణీ లేదని బత్తిని హరినాధ్ గౌడ్ తెలిపారు. ప్రమాదకర రీతిలో కరోనా కేసులు పెరగటం ప్రధాన కారణమని అన్నారు. ఈ నేపథ్యంలో మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేపమందును పంపిణీ చేయలేకపోతున్నామన్నారు.

ఈసారి జూన్ 8న చేపమందు ప్రసాదం కేవలం ఇంట్లో వాళ్ళమే తీసుకుంటామని బత్తిని హరినాధ్ గౌడ్ చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే జనానికి హైదరాబాద్ దూద్ బౌలిలోని మృగశిర ట్రస్టు భవన్ లో చేప ప్రసాదం ఇస్తామని బత్తిని సోదరుడు హరినాథ్ గౌడ్ వెల్లడించారు. చేప ప్రసాదం పంపిణీ ఆ రోజు 24 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు.

తక్కువ పోస్టులతోనే అత్యధిక రికార్డు సాధించిన తారక్?

వంశీ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ స్ట్రైట్ సినిమా?

హాట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -