Friday, April 26, 2024
- Advertisement -

రాజమౌళి అమెరికాకి అందుకే వెళ్లారా?

- Advertisement -

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన తదుపరి సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జక్కన్న ఈ మధ్యనే అమెరికా లో కనిపించారు. ఈ నేపథ్యంలో అందరూ రాజమౌళి తానా మ్యూజికల్ నైట్ కి హాజరవడం కోసం అమెరికా వెళ్లారని అనుకున్నారు. కానీ సోషల్ మీడియా ద్వారా తాను వేరే పనిమీద వెళ్లానని తానాకి హాజరవడం కుదరలేదని క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. అమెరికాకి తానొక పర్సనల్ ట్రిప్ మీద వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. కానీ అసలు రాజమౌళి అమెరికా ఎందుకు వెళ్లినట్టు? ఆడిషన్స్ కోసం అని కొందరు సమాధానమిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా 1920 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం కొందరు ఇంగ్లీష్ నటి నటులు కూడా కావాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సినిమాలు బ్రిటిష్ వారి పాత్రల కోసం రాజమౌళి కొందరు అమెరికా నటీనటులను ఎంపిక చేయనున్నారు. వారి ఆడిషన్స్ కోసమే రాజమౌళి లాస్ ఏంజల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు రాజమౌళి ఆడిషన్ చేశారని చెబుతున్నారు. త్వరలో ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -