Saturday, April 27, 2024
- Advertisement -

మహేష్, ప్రభాస్ లతో చేస్తా : రేణు దేశాయ్

- Advertisement -

ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్స్ కు మంచి డిమాండ్ ఉంది. అమ్మగా, అక్కగా, వదినగా చేయడానికి ఒప్పుకుంటే వాళ్లంత బిజీగా ఎవరు ఉండరు. స్టార్ హీరోయిన్స్ ఒకప్పుడు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసి ఇప్పుడు వారి సినిమాల్లోనే ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. కొందరు హీరోయిన్స్ ఇప్పటి యంగ్ హీరోలకు తల్లిపాత్రలో కనిపిస్తున్నారు.

అమ్మగా మారిన హీరోయిన్స్ జాబితాలో రేణు దేశాయ్ కూడా జాయిన్ అయ్యేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇటివలే ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన రేణు దేశాయ్ కొన్ని కీలక విషయాలు చెప్పింది. మళ్లీ సినిమాలు చేయాలనే అనుకుంటున్నాను. హీరోలకు తల్లి పాత్రలో నటించేందుకు కూడా నేను సిద్దమే అన్నట్లుగా రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. తెలుగులో మహేష్ బాబు.. ప్రభాస్ వంటి స్టార్స్ కు అమ్మ పాత్రల్లో నటించేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహేష్ బాబు కంటే దాదాపు అయిదేళ్లు చిన్న వయసు అయినా కూడా రేణు దేశాయ్ ఆయనకు తల్లిగా నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పడం నిజంగా అభినందనీయం.

పవన్ సినిమాల్లో నటించడానికి మాత్రం రేణు ఆసక్తి చూపించడం లేదు. హీరోయిన్ గా చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అవ్వడంతో ఈమెకు విపరీతమైన క్రేజ్ తెలుగు జనాల్లో ఉంది. రేణు దేశాయ్ గురించి ప్రతి విషయం అందరికీ ఆసక్తి ఉంటుంది. ఈమె తల్లిగా నటించేందుకు రెడీగా ఉంది.. మరి మన హీరోలు ఈమెకు కొడుకుగా నటించేందుకు ఆసక్తి చూపిస్తారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -