Saturday, April 27, 2024
- Advertisement -

సాహో హీరోయిన్ కి ఉన్న మానసిక సమస్య అదే

- Advertisement -

బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమ లో స్టార్డం ని అనుభవిస్తూన్న హీరోయిన్ శ్రద్ధ కపూర్. అయితే ఈ భామ ఈ మధ్య ఒక సమస్య గురించి ఎక్కువగా బాధ పడుతుంది అని తెలిసింది. ఏంటో ఏమో గానీ తన మానసిక పరిస్థితి కి సంబందించినది ఈ సమస్య అని శ్రద్ధ ఇటీవలే వివరించింది. ఎన్ని పరీక్షలు చేయించినా తన సమస్య ఏంటో అర్ధం కాలేదు అని కూడా చెప్పింది.

ఇటీవలే తన మానసిక స్థితి గతుల గురించి మీడియా కి వివరిస్తూ తనకి ఉన్న ఈ సమస్య గురించి చెప్పుకొచ్చింది శ్రద్ధ. “నేను సాధారణం గా ఎక్కువ యాంక్షియస్ అవుతూ ఉంటాను. మనం మనలో ఉన్న సమస్యలని ఒప్పుకుంటే నే పెద్ద మార్పు తీసుకొని రాగలము.” అని చెప్పింది శ్రద్ధ.

అంతే కాకుండా, ఇంకా ఈ సమస్య గురించి వివరిస్తూ, “ఇటీవలే నేను డాక్టర్ల ని కలిసి వైద్య చికిత్సలు కూడా చేయించుకున్నాను. అన్నీ రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నట్టు తెలిసింది.కానీ నాలో ఉన్న ప్రాబ్లమ్ అనేది మాత్రం కనుక్కోలేకపోయారు.” అని చెప్పింది శ్రద్ధ.

ప్రస్తుతం సాహో తో తెలుగు తమిళ ప్రేక్షకులని పలకరించిన ఈ భామ ఇకపై సౌత్ లో మరిన్ని సినిమాలు చేయాలని ఆశ పడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -