స్కూట‌ర్ మీద చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మంత‌

218
Samantha 'Baby' movie photos viral on social media
Samantha 'Baby' movie photos viral on social media

అక్కినేని ఇంటి కొడ‌లు వరుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. పెళ్లి త‌రువాత స‌మంత న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ కావ‌డంతో ఈ బామ‌కు మ‌రింత డిమాండ్ పెరిగింది. పెళ్లి త‌రువాత భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి మొద‌టిసారి మ‌జ్ను సినిమాలో క‌నిపించ‌నుంది. ఈ సినిమాలో చైత‌న్య భార్య‌గానే న‌టించింది స‌మంత‌. ఈ సినిమాతో పాటు నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో బేబీ అనే సినిమాలో కూడా న‌టిస్తోంది.

తాజాగా ఈ సినిమాలో కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి. ఇందులోని ఓ ఫోటోలో స‌మంత స్కూట‌ర్ న‌డుపుతు క‌నిపించి తెగ హ‌ల్ చ‌ల్ చేసింది.చలాకీగా బజాజ్ స్కూటర్ లాంటిది వేసుకుని రయ్యిమని దూసుకుపోతూ ఉంటే వెనుక పిల్లలు యూత్ కేరింతలు కొడుతూ ఫాలో కావడం చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో స‌మంత‌తో పాటు సీనియర్ నటి లక్ష్మి హీరో నాగ శౌర్య కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఓ కొరియన్ మూవీ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సమంతా లక్ష్మిల పాత్రలు షాక్ ఇచ్చే రీతిలో ఉంటాయట. నందిని రెడ్డితో గ‌తంలో జబర్దస్త్ అనే సినిమాలో న‌టించింది. ఈ సినిమా అనుకున్నంత విజ‌యం సాధించ‌లేదు.మ‌రి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో మూవీ అయిన వీరికి హిట్‌ను అందిస్తుందేమో చూడాలి.