అక్కినేని దంపతుల ఆస్థి విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..?

1644
samantha chaitnya devt details
samantha chaitnya devt details

అక్కినేని హీరో నాగ చైతన్య, బ్యూటిఫుల్ సమంత ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక ఇంటివారయిన సంగతి తెలిసిందే. పెళ్ళైన దగ్గరినుంచి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ జంటగా ఈ దంపతులు ఎప్పుడు ట్రెండింగ్ గా ఉంటూనే ఉన్నారు.. సమంత తన భర్త ఫోటోలు సోషల్ మీడియా లో పెట్టి ఎప్పటికప్పు తన ప్రేమను చాటుకుంటూనే ఉంటుంది.

పెళ్ళికి మునుఁడు వీరు వీరు ప‌లు మూవీల్లో న‌టించారు. పెళ్లి త‌రువాత కూడా సినిమాలు చేశారు. అయితే టాలీవుడ్‌లో ఓ సోర్స్ ద్వారా అందుతున్న విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. స‌మంత ఆస్తి విలువ రూ.84 కోట్లు ఉంటుంద‌ని తెలిసింది. అలాగే నాగ చైత‌న్య ఆస్తి విలువ రూ.38 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి ఆస్తి విలువ రూ.122 కోట్లు ఉంటుంద‌ని తెలుస్తోంది.

కాగా స‌మంత‌, నాగ‌చైత‌న్య ఇద్ద‌రూ సినిమాల్లో స‌క్సెస్ అయ్యారు. అలాగే ప‌లు కంపెనీల‌కు వీరు ప్రచార‌క‌ర్త‌లుగా ఉండి యాడ్స్ చేస్తున్నారు. దీంతో ఆ మొత్తం సంపాదించ‌గ‌లిగారు. అయితే స‌మంత ఇటీవ‌లే మ‌రో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టిన‌ట్లు ప్ర‌క‌టించింది. సాకి పేరిట ఓ ఫ్యాష‌న్ బిజినెస్‌ను స్టార్ట్ చేస్తున్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా ఆమే స్వ‌యంగా తెలిపింది. సాకి త‌న క‌ల‌ల ప్రాజెక్టు అని, ఎన్నో నెలల నుంచి బేబీ రూపంలో ఉన్న ఆ ఆలోచ‌న కార్య‌రూపం దాల్చింద‌ని స‌మంత తెలిపింది. సాకి బ్రాండ్ ఉత్ప‌త్తుల‌ను త్వ‌ర‌లోనే లాంచ్ చేస్తాన‌ని తెలియ‌జేసింది. ఫ్యాష‌న్ ప‌ట్ల మ‌క్కువ‌తోనే ఈ బ్రాండ్ ను నెల‌కొల్పిన‌ట్లు తెలిపింది. సాకి నుంచి వ‌చ్చే ఫ్యాష‌న్ ఉత్ప‌త్తులపై త‌న‌దైన ముద్ర ఉంటుంద‌ని, ప్ర‌తి ఒక్క‌రికీ త‌క్కువ ధ‌ర‌కే ఆ ఉత్ప‌త్తులు అందుబాటులో ఉంటాయ‌ని స‌మంత తెలియ‌జేసింది.

Loading...